దశాబ్దాల సాంప్రదాయం... బూర్ల వంశస్తుల ఆనవాయితీ.

దశాబ్దాల సాంప్రదాయం... బూర్ల వంశస్తుల ఆనవాయితీ.

*బూర్ల పెద్ద కొమురయ్య ఆధ్వర్యంలో... దసరా వేడుకలు*

*బొడ్రాయి వద్ద బేతాళ స్వామికి ఘనంగా పూజలు*

*శమీ పూజ, జమ్మి ఆకుల పంపకం... భారీగా పాల్గొన్న ప్రజలు*

*శివునిపల్లిలో ప్రశాంతంగా ముగిసిన దసరా*

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

స్టేషన్ ఘన్‌పూర్ మండలం శివునిపల్లి గ్రామ బోడ్రాయి వద్ద వెలసిన బేతాళ స్వామి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.దశాబ్దాలుగా వస్తున్న బూర్ల వంశస్థుల ఆనవాయితీ ప్రకారం బూర్ల పెద్ద కొమురయ్య ఆధ్వర్యంలో మంగళవారం దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కుల పెద్ద మనుషులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం జమ్మి చెట్టుకు శమీ పూజ చేసి, జమ్మి ఆకులను ఒకరికొకరు పంచుకుంటూ ఆశీర్వాదాలు తీసుకున్నారు.బేతాళ స్వామి అనుగ్రహంతో గ్రామంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ప్రార్థించినట్లు దసరా ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ వేడుకలలో ఆరవ వార్డు కౌన్సిలర్ బుర్ల రాజేశ్వర్,విష్ణు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పోలీస్ అమరవీరులకు నివాళ్లు . పోలీస్ అమరవీరులకు నివాళ్లు .
జఫర్గడ్ ,అక్టోబర్ 21(తెలంగాణ ముచ్చట్లు) పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో  ఎస్సై బి.వినయ్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి,సెంటర్ లో పోలీస్...
హుస్సేన్ జాఫర్ ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు .
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అండగా   వారధి ఫౌండేషన్.
రావణుడి అంతంతో.. విజయదశమి సందడి!
మున్నూరుకాపు భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధుల విడుదలకు కలెక్టర్ అంగీకారం.
అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం.
జనసందోహం నడుమ దసరా వైభవం..