వైరాగ్యగిరి ప్రదక్షిణ మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం.
పెద్దమందడి,అక్టోబర్09(తెలంగాణ ముచ్చట్లు):
పులకుర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించనున్న వైరాగ్యగిరి గిరి ప్రదక్షిణ సంప్రోక్షణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ కమిటీ సభ్యులు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ సందర్భంగా మహోత్సవ నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై ఎమ్మెల్యే కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలోని శైవక్షేత్రాల్లో తొలిసారిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించడంతో పాటు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.అలాగే మహోత్సవానికి అవసరమైన సదుపాయాలపై ఆరా తీసి, అవసరమైన చోట తన సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డి, మదిరె శ్రీశైలం, భీంరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మాధవ్ రెడ్డి పాల్గొన్నారు.


Comments