పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం!
ధర్మసాగర్ మండల ఇన్‌చార్జ్‌లుగా కర్ర సోమిరెడ్డి, గుర్రపు ప్రవీణ్ నియామకం.
ధర్మసాగర్,అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కీలక బాధ్యతలను అప్పగిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆదేశాల మేరకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లను ప్రకటించారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నాగుర్ల వెంకటేశ్వర్లును నియమించగా, ధర్మసాగర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా కర్ర సోమిరెడ్డి, గుర్రపు ప్రవీణ్‌లకు బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా కర్ర సోమిరెడ్డి, గుర్రపు ప్రవీణ్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఎన్నికల బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.మండలంలోని పట్టభద్రుల ఓటర్లను కలిసి పార్టీ విధానాలు, గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల వరకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.


Comments