పండుగ సాయన్న పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

పండుగ సాయన్న పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.

వనపర్తి,అక్టోబర్22(తెలంగాణ ముచ్చట్లు):

సమాజంలో సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాడిన పండుగ సాయన్న సేవలు చిరస్మరణీయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పండుగ సాయన్న ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన జీవిత చరిత్రను, సమాజానికి అందించిన సేవలను యువత తెలుసుకోవడంతో పాటు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చొప్పదండిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం. చొప్పదండిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం.
*త్వరలో ప్రజలకు వైద్య సేవలు: మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత-శ్రీనివాస్* చొప్పదండి, అక్టోబర్ 22(తెలంగాణ ముచ్చట్లు ): చొప్పదండి పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య...
ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు.
చౌరస్తాకు వెలుగులు.. రహదారికి గుంతలు!
వంగర నూతన ఎస్‌ఐని మర్యాదపూర్వకంగా కలిసిన ముల్కనూర్ ప్రజాప్రతినిధులు.
పండుగ సాయన్న పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.
పండుగ సాయన్న, కొమరం భీమ్‌కు యువజన కాంగ్రెస్ ఘన నివాళి.
నాగేంద్రమ్మ మృతదేహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘన నివాళులు.