దండు నాగేంద్రమ్మ మృతి పట్ల ఎమ్మెల్యే మేఘారెడ్డి సంతాపం.
పెద్దమందడి,అక్టోబర్22(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ సర్పంచ్ దండు అశోక్ మాతృమూర్తి దండు నాగేంద్రమ్మ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మరణవార్త తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్టూర్ గ్రామంలోని ఆమె నివాసానికి చేరుకుని, నాగేంద్రమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం దండు అశోక్, దండు నరేష్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, నాగేంద్రమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆర్. శ్రీనివాస్ రెడ్డి, కొమ్ము వెంకటస్వామి, డీఎస్ మహేష్, సి. వెంకటేశ్వర్లు, దిండు రవీందర్ తదితర స్థానిక నాయకులు పాల్గొని నాగేంద్రమ్మకు నివాళులర్పించారు.


Comments