పండుగ సాయన్న, కొమరం భీమ్‌కు యువజన కాంగ్రెస్ ఘన నివాళి.

పండుగ సాయన్న, కొమరం భీమ్‌కు యువజన కాంగ్రెస్ ఘన నివాళి.

-ముల్కనూర్ అంబేద్కర్ కూడలిలో జయంతి వేడుకలు..

 -మహనీయుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి: జక్కుల అనిల్ యాదవ్

భీమదేవరపల్లి, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

భీమదేవరపల్లి మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్ నాయకత్వంలో ముల్కనూర్ అంబేద్కర్ కూడలిలో వీర యోధులు పండుగ సాయన్న, కొమరం భీమ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం మహనీయులు చేసిన పోరాటాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని జక్కుల అనిల్ యాదవ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉషాకోయిల ప్రకాష్, బొజ్జపురి అశోక్ ముఖర్జీ, ఆదరి రవీందర్, పొన్నాల మురళి, డబ్బా శంకర్, శ్రీరామోజు సమ్మయ్య, మాడుగుల గోపి, కాసగోని బాలకృష్ణ, తల్లా సదానందం, వెంకన్న, మాడుగుల కొమురయ్య, పూర్ణచందర్, వొల్లాల రమేష్, కిషోర్, తాకిల్ పాషా, పొన్నాల మధుసూదన్ రెడ్డి, కూన దేవరాజు, బొల్లంపల్లి షెడ్రక్, సదానందం, మొండయ్య, మాడుగుల యాదగిరి, సికా ప్రభాకర్, నాగరబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సర్పంచులు మేకల వెంకన్న, డప్పు శ్రీనివాస్, కాలేరు శ్రవణ్‌తో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు పోగుల శ్రీకాంత్, గుడికందుల రాజు, మాడుగుల చింటూ, బొల్లంపల్లి రంజిత్, చిలుకూరి నితిన్, నిఖిల్, ఎల్దీ వినోద్, రాకేష్, అజయ్, రెనా ప్రవీణ్ పాల్గొన్నారు.

మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు ఆదరి స్వప్న, అన్నపూర్ణమ్మ, శోభతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.IMG-20261022-WA0005

Tags:

Post Your Comments

Comments

Latest News

చొప్పదండిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం. చొప్పదండిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం.
*త్వరలో ప్రజలకు వైద్య సేవలు: మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత-శ్రీనివాస్* చొప్పదండి, అక్టోబర్ 22(తెలంగాణ ముచ్చట్లు ): చొప్పదండి పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య...
ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు.
చౌరస్తాకు వెలుగులు.. రహదారికి గుంతలు!
వంగర నూతన ఎస్‌ఐని మర్యాదపూర్వకంగా కలిసిన ముల్కనూర్ ప్రజాప్రతినిధులు.
పండుగ సాయన్న పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.
పండుగ సాయన్న, కొమరం భీమ్‌కు యువజన కాంగ్రెస్ ఘన నివాళి.
నాగేంద్రమ్మ మృతదేహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘన నివాళులు.