చొప్పదండిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం.

రూ.37.50 కోట్లతో నిర్మాణ పనులు దాదాపు పూర్తి.

చొప్పదండిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం.

*త్వరలో ప్రజలకు వైద్య సేవలు: మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత-శ్రీనివాస్*

చొప్పదండి, అక్టోబర్ 22(తెలంగాణ ముచ్చట్లు ):

చొప్పదండి పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి రానుందని మున్సిపల్IMG-20261022-WA0016 చైర్‌పర్సన్ వడ్లూరి సరిత-శ్రీనివాస్ తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో ఆసుపత్రి ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.

రూ.37.50 కోట్ల నిధులతో చేపట్టిన ఆసుపత్రి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, ప్రస్తుతం ఫర్నిచర్ రావాల్సి ఉందని తెలిపారు. అది కూడా త్వరలో అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. మున్సిపల్ పాలకవర్గం పలుమార్లు ఆసుపత్రిని సందర్శించి పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని వివరించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రి దామోదర రాజనర్సింహతో సమన్వయం చేసుకుంటూ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చేందుకు కృషి చేశారని తెలిపారు. త్వరలో మంత్రి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కృషితో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చైర్‌పర్సన్ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణం, నియోజకవర్గ అభివృద్ధికి వివిధ పనులు చేపడుతున్నామని తెలిపారు.

చొప్పదండి నియోజకవర్గ, పట్టణ ప్రజల తరఫున ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం, మంత్రి దామోదర రాజనర్సింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చొప్పదండిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం. చొప్పదండిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం.
*త్వరలో ప్రజలకు వైద్య సేవలు: మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత-శ్రీనివాస్* చొప్పదండి, అక్టోబర్ 22(తెలంగాణ ముచ్చట్లు ): చొప్పదండి పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య...
ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు.
చౌరస్తాకు వెలుగులు.. రహదారికి గుంతలు!
వంగర నూతన ఎస్‌ఐని మర్యాదపూర్వకంగా కలిసిన ముల్కనూర్ ప్రజాప్రతినిధులు.
పండుగ సాయన్న పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.
పండుగ సాయన్న, కొమరం భీమ్‌కు యువజన కాంగ్రెస్ ఘన నివాళి.
నాగేంద్రమ్మ మృతదేహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘన నివాళులు.