పండుగల వేళ ప్రజలకు ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్డు నిర్మాణం.
వేలేరు, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో గ్రామాభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
గ్రామ పంచాయతీ నిధులతో 9వ వార్డులోని ముప్పరపు సుధాకర్ నివాసం నుంచి బతుకమ్మ ఆడే స్థలం జంగం కుంట వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
రాబోయే సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా, బతుకమ్మ ఆడే స్థలానికి వెళ్లేందుకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో పండుగల సమయంలో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి.
గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జితేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ గుడికందుల ప్రశాంత్, 9వ వార్డు సభ్యురాలు గుండెల్లి సౌజన్య అనిల్, వార్డు సభ్యులు సుకన్య, శ్రీకాంత్, రాకేష్, అశ్విని-అనిల్, ఉప్పల శ్రీధర్ రెడ్డి, జగన్, పురామణి రాజు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Comments