ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు.

బడుగు, బలహీన వర్గాల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యం: బీసీ జేఏసీ నాయకులు.

ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు.

హుజురాబాద్,అక్టోబర్ 22(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొమురం భీం, పండుగ సాయన్న జయంతి ఉత్సవాలను స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీం, అగ్రవర్ణ ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా పోరాడిన పండుగ సాయన్న త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు.
మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బడుగు, బలహీన వర్గాల ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాల ప్రజలు రాజకీయంగా, సామాజికంగా ఎదిగి రాజ్యాధికారంలో భాగస్వాములైనప్పుడే మహనీయులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగి తమ బలాన్ని నిరూపించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వన్నాల శివాజీ, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఆలేటి రవీందర్, మామునూరు ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, ఆడెపు శ్రీనివాస్, పుల్లూరి కృష్ణమూర్తి, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల ఓదెలు, ప్రజా సంఘాల నాయకులు రామ్ రాజేష్, తిప్పారపు భువనచందర్, మోలుగు రమేష్, ఇల్లందుల సమ్మయ్య, దాట్ల ప్రభాకర్, ఎండీ బాబా, పోతారం అశోక్, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చొప్పదండిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం. చొప్పదండిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం.
*త్వరలో ప్రజలకు వైద్య సేవలు: మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత-శ్రీనివాస్* చొప్పదండి, అక్టోబర్ 22(తెలంగాణ ముచ్చట్లు ): చొప్పదండి పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య...
ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు.
చౌరస్తాకు వెలుగులు.. రహదారికి గుంతలు!
వంగర నూతన ఎస్‌ఐని మర్యాదపూర్వకంగా కలిసిన ముల్కనూర్ ప్రజాప్రతినిధులు.
పండుగ సాయన్న పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.
పండుగ సాయన్న, కొమరం భీమ్‌కు యువజన కాంగ్రెస్ ఘన నివాళి.
నాగేంద్రమ్మ మృతదేహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘన నివాళులు.