జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన.

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.

కరీంనగర్,అక్టోబర్ 23(తెలంగాణ ముచ్చట్లు ):

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో సీపీఎం, అనుబంధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు అత్యంత కీలకమని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి అర్హత కలిగిన ఓటరుకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

ఓటు హక్కు పరిరక్షణకు ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వల్ల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితులు తలెత్తకుండా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం నిరసనలో భాగంగా జ్ఞానేశ్‌ కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యూ. శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాయికంటి శ్రీనివాస్‌, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గుగులోతు భీమా సాహెబ్‌, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పారపు సురేష్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల రాజు, ఐద్వా జిల్లా కార్యదర్శి కోరేటి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం!
ధర్మసాగర్,అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):  రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ...
రైతులకు అదనపు ధర.. పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు.
రైల్వే బోర్డు సభ్యుల కు వినతి పత్రం సమర్పించిన రైల్వే జేఏసీ .
కన్నవారే కాదంటే.. వృద్ధులకు మేమున్నామంటూ బాలవికాస భరోసా!
ఎర్రబెల్లి సంపత్ రావుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్ష పదవి.. మూడోసారి అవకాశం!
ఎండిపోతున్న పంటలకు జీవజలం.