పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.
పలుస శంకర్ గౌడ్, జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .
వనపర్తి,అక్టోబర్23(తెలంగాణ ముచ్చట్లు):
పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ కోరారు. వనపర్తి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న 25 మంది ఉపాధ్యాయులు ఆన్‌లైన్ ద్వారా పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. 2026 నవంబర్ 1 నాటికి డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత పూర్తి చేసి మూడేళ్లు నిండిన అర్హులు ఫారం-18 ద్వారా పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.ఓటరు నమోదుకు డిగ్రీ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఆధార్ కార్డు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా సంబంధిత అధికారుల వద్ద ఆఫ్‌లైన్‌లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని వివరించారు.వనపర్తి జిల్లాలోని పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు అర్హత ఉంటే తమ పేర్లను పట్టభద్రుల ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుగా ఓటరుగా నమోదు కావాలని పేర్కొన్నారు.ఓటరు నమోదు చివరి తేదీ నవంబర్ 6 అని, చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులను అభినందించిన ఆయన, జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.


Comments