రైతులకు అదనపు ధర.. పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

రైతులకు అదనపు ధర.. పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

ముల్కనూర్, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

భీమదేవరపల్లి మండలంలోని సహకార పారాబాయిల్డ్ రైస్ మిల్లు ఆవరణలో శుక్రవారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సహకార అధికారి బి. మోహన్, సంఘ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, సంఘ జనరల్ మేనేజర్ ఎం. రాంరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మార్కెట్‌లో పత్తి ధర క్వింటాల్‌కు రూ.9,010 ఉండగా, సహకార సంఘం అదనంగా రూ.200 కలిపి క్వింటాల్‌కు రూ.9,210 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. దీంతో రైతులకు మార్కెట్ ధర కంటే అదనపు ధర లభించనుంది.
ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గ సభ్యులు, మిల్లు మేనేజర్ అభిలాష్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం!
ధర్మసాగర్,అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):  రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ...
రైతులకు అదనపు ధర.. పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు.
రైల్వే బోర్డు సభ్యుల కు వినతి పత్రం సమర్పించిన రైల్వే జేఏసీ .
కన్నవారే కాదంటే.. వృద్ధులకు మేమున్నామంటూ బాలవికాస భరోసా!
ఎర్రబెల్లి సంపత్ రావుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్ష పదవి.. మూడోసారి అవకాశం!
ఎండిపోతున్న పంటలకు జీవజలం.