ఎర్రబెల్లి సంపత్ రావుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్ష పదవి.. మూడోసారి అవకాశం!

గండ్రపల్లి నుంచి జిల్లా స్థాయి నాయకత్వం వరకు ప్రస్థానం..

ఎర్రబెల్లి సంపత్ రావుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్ష పదవి.. మూడోసారి అవకాశం!

IMG-20261023-WA0026జమ్మికుంట, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగిన ఎర్రబెల్లి సంపత్ రావుకు మరోసారి జిల్లా ఉపాధ్యక్షుడిగా అవకాశం లభించింది. జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామానికి చెందిన ఆయన మూడోసారి ఈ బాధ్యతలు చేపట్టడం విశేషం. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సాగించిన ఆయన రాజకీయ ప్రస్థానం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

బీజేవైఎం జమ్మికుంట మండల అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సంపత్ రావు, అనంతరం బీజేపీ జమ్మికుంట మండల అధ్యక్షుడిగా మూడుసార్లు బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం, సంస్థాగత కార్యకలాపాలను విస్తరించడం వంటి బాధ్యతల్లో పనిచేశారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, కరీంనగర్ జిల్లా బీజేపీ కార్యదర్శిగా సేవలందించారు. తదుపరి జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, తాజాగా మరోసారి అదే పదవికి నియమితులయ్యారు.

జిల్లా ఉపాధ్యక్షుడిగా మూడోసారి అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి సంపత్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిని మల్లేశం, మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

సంపత్ రావు మూడోసారి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా జమ్మికుంట బీజేపీ శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడు జీడీ మల్లేశ్, ఇల్లందకుంట మండల మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, కోరె రవీందర్, కొమ్ము అశోక్, మేక సుధాకర్ రెడ్డి, పల్లపు రవి, గుర్రం పరశురాం, గట్టు సాయిరాం, మోత స్వామి, ఇటుకాల స్వరూప, ఎదులాపురం అశోక్, మోడెం రాజు, లోకిని రాజేష్, తూర్పాటి శంకర్, కడెం సతీష్, ఉడుగుల మహేందర్, పోడేటి అనిల్, ఏగ్గటి హరీష్, చంద్ర మౌళి, బొజ్జ శరత్, కనుమల్ల లక్ష్మి, లల్లు, పసునూటి శివ, లకిడే రాజు, గడ్డం శ్రీ వర్మ, కొడం శ్రావణ్, పల్లబోయిన పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం!
ధర్మసాగర్,అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):  రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ...
రైతులకు అదనపు ధర.. పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు.
రైల్వే బోర్డు సభ్యుల కు వినతి పత్రం సమర్పించిన రైల్వే జేఏసీ .
కన్నవారే కాదంటే.. వృద్ధులకు మేమున్నామంటూ బాలవికాస భరోసా!
ఎర్రబెల్లి సంపత్ రావుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్ష పదవి.. మూడోసారి అవకాశం!
ఎండిపోతున్న పంటలకు జీవజలం.