పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ముందుకు రావాలి.
బీఆర్ఎస్ నేతల పిలుపు
వేలేరు, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనుకునే అర్హులైన పట్టభద్రులంతా వెంటనే ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని వేలేరు మండల బీఆర్‌ఎస్ నాయకులు కీర్తి వెంకటేశ్వర్లు, కొయ్యడ మహేందర్, కొయ్యడ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. డిగ్రీ పట్టా పొంది మూడేళ్లు పూర్తయిన అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరు నమోదుపై అవగాహన కలిగి ఉండాలని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేయాలని కోరారు. ఓటరు నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా అర్హులైన పట్టభద్రులంతా సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో షోడశపల్లి బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్,రాజుతో పాటు తిరుపతి, వెంకటేష్, విజేందర్ రెడ్డి తదితర బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


Comments