ఎండిపోతున్న పంటలకు జీవజలం.

రైతుల విజ్ఞప్తికి స్పందన.. పెద్ద చెరువు తూము ద్వారా పొలాలకు నీటి విడుదల.

ఎండిపోతున్న పంటలకు జీవజలం.

జమ్మికుంట, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

పంట చేతికొచ్చే చివరి దశలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో ఆందోళనకు గురైన వావిలాల గ్రామ రైతులకు మార్కెట్ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం అండగా నిలిచారు. రైతులు తమ సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లగానే తక్షణమే స్పందించి, నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి గ్రామంలోని పెద్ద చెరువు తూమును తెరిపించి పంట పొలాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు.

పంట చివరి దశలో నీరు అందకపోతే దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్న రైతులకు ఈ చర్య ఊరటనిచ్చింది. సకాలంలో నీరు అందడంతో పంటలు ఎండిపోకుండా కాపాడుకునేందుకు అవకాశం లభించిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

తమ సమస్యను వివరించిన వెంటనే స్పందించి సాగునీరు అందించేందుకు చొరవ చూపిన మార్కెట్ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందంకు వావిలాల గ్రామ రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.IMG-20261023-WA0030

Tags:

Post Your Comments

Comments

Latest News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం!
ధర్మసాగర్,అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):  రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ...
రైతులకు అదనపు ధర.. పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు.
రైల్వే బోర్డు సభ్యుల కు వినతి పత్రం సమర్పించిన రైల్వే జేఏసీ .
కన్నవారే కాదంటే.. వృద్ధులకు మేమున్నామంటూ బాలవికాస భరోసా!
ఎర్రబెల్లి సంపత్ రావుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్ష పదవి.. మూడోసారి అవకాశం!
ఎండిపోతున్న పంటలకు జీవజలం.