జర్నలిస్టులకు రైల్వే పాసులు పునరుద్ధరించాలి.

జర్నలిస్టులకు రైల్వే పాసులు పునరుద్ధరించాలి.

IMG-20261009-WA0014రక్షణ చట్టాన్ని పటిష్టం చేయాలి.. టోల్‌ ఫీజు మినహాయింపు కల్పించాలి

వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు): 

జర్నలిస్టులకు రైల్వే పాసులను పునరుద్ధరించాలని, జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని పటిష్టం చేయడంతో పాటు టోల్‌ ప్లాజాల వద్ద టోల్‌ ఫీజు మినహాయింపు కల్పించాలని కోరుతూ తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం (టీఎంజేఎఫ్) రాష్ట్ర నాయకులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కరీంనగర్‌లోని మంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులకు గతంలో అందించిన రైల్వే పాసులను పునరుద్ధరించాలని, విధి నిర్వహణలో జర్నలిస్టులకు భద్రత కల్పించేలా రక్షణ చట్టాన్ని పటిష్టం చేయాలని నాయకులు కోరారు. వార్తా సేకరణ, ప్రజా సమస్యల పరిశీలన కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే జర్నలిస్టులకు టోల్‌ ప్లాజాల వద్ద టోల్‌ ఫీజు మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయుల పాత్ర కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులకు తగిన భద్రతతో పాటు సంక్షేమ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు.

టీఎంజేఎఫ్ నాయకులు సమర్పించిన వినతిపత్రంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని టీఎంజేఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు. రైల్వే పాసుల పునరుద్ధరణ, రక్షణ చట్టం పటిష్టత, టోల్‌ ఫీజు మినహాయింపు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎంజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లెపాక రాజేష్,కోశాధికారి బోట్ల సదానందం, రాష్ట్ర గౌరవ సలహాదారు పసుల తిరుపతి,రాష్ట్ర ఉపాధ్యక్షులు వక్కల వెంకటస్వామి,
రాష్ట్ర కార్యదర్శులు అనిల్,రాష్ట్ర నాయకులు సర్వాణి శ్రీనివాస్,గాజుల స్వామి,మాతంగి శ్రీనివాస్,కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి లంక స్వామి,సిరిసిల్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం!
ధర్మసాగర్,అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):  రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ...
రైతులకు అదనపు ధర.. పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు.
రైల్వే బోర్డు సభ్యుల కు వినతి పత్రం సమర్పించిన రైల్వే జేఏసీ .
కన్నవారే కాదంటే.. వృద్ధులకు మేమున్నామంటూ బాలవికాస భరోసా!
ఎర్రబెల్లి సంపత్ రావుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్ష పదవి.. మూడోసారి అవకాశం!
ఎండిపోతున్న పంటలకు జీవజలం.