మండల స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు.

పెద్దమందడి ఎంపీడీవో పరిణత.

మండల స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు.

పెద్దమందడి,అక్టోబర్09(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి  మండలంలోని యువ క్రీడాకారులతో పాటు క్రీడలపై ఆసక్తి ఉన్న అన్ని వర్గాల ప్రజలను ప్రోత్సహించేందుకు మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పెద్దమందడి ఎంపీడీవో పరిణత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 16, 17 తేదీల్లో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్, టగ్ ఆఫ్ వార్, క్యారమ్స్, చెస్ తదితర క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.దసరా సెలవుల్లో నిర్వహించనున్న క్రీడా పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపిక కోసం ఈ నెల 10వ తేదీ ఉదయం 8.30 గంటలకు పెద్దమందడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీడీవో, ఎంఈవో, తహసీల్దార్, పీడీ, పీఈటీల సమక్షంలో జరిగే ఈ సమావేశంలో క్రీడా పోటీల నిర్వహణ, జట్ల ఎంపిక, ఇతర ఏర్పాట్లపై చర్చించనున్నారు.ఈ పోటీల్లో వయసుతో సంబంధం లేకుండా యువ క్రీడాకారులు, ఉద్యోగులు, క్రీడలపై ఆసక్తి ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు. మండలంలోని అన్ని గ్రామాల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్ల ఎంపికకు హాజరై క్రీడా పోటీల్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు ప్రజల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం!
ధర్మసాగర్,అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):  రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ...
రైతులకు అదనపు ధర.. పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు.
రైల్వే బోర్డు సభ్యుల కు వినతి పత్రం సమర్పించిన రైల్వే జేఏసీ .
కన్నవారే కాదంటే.. వృద్ధులకు మేమున్నామంటూ బాలవికాస భరోసా!
ఎర్రబెల్లి సంపత్ రావుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్ష పదవి.. మూడోసారి అవకాశం!
ఎండిపోతున్న పంటలకు జీవజలం.