రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభం.
Views: 0
On
వేలేరు, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వేలేరు గ్రామానికి మంజూరైన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వేను మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని, ఎంపికైన లబ్ధిదారులకు త్వరలో మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు నిర్ణీత గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్వే ప్రత్యేక అధికారి రూపవతి, హౌసింగ్ ఏఈ అభిలాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Oct 2026 19:28:29
ధర్మసాగర్,అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ...


Comments