ప్రజాసేవే పోలీసుల పరమ ధ్యేయం.

ప్రజాసేవే పోలీసుల పరమ ధ్యేయం.

-ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి.. వరంగల్ సీపీ ఎన్. శ్వేతా ఐపీఎస్

-ముల్కనూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

భీమదేవరపల్లి, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా ఐపీఎస్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు పోలీస్ స్టేషన్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత పూల మొక్కను అందజేసి సీపీకి స్వాగతం పలికారు. అనంతరం ఎస్సై ఎం. రాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.

పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను సీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం కూడా పోలీసులను ఆశ్రయిస్తారని, అలాంటి సమయంలో వారి సమస్యలను ఓపికగా విని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి పోలీసు శాఖపై నమ్మకాన్ని పెంపొందించాలని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం పోలీసులకు దక్కిన గౌరవమని, “ప్రజాసేవే పోలీసుల పరమ ధ్యేయం” అని స్పష్టం చేశారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ మామిడి మొక్కను నాటారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సీఐ కె. శ్రీను, ముల్కనూరు ఎస్సై ఎం. రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.IMG-20261009-WA0018

Tags:

Post Your Comments

Comments

Latest News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం!
ధర్మసాగర్,అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):  రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ...
రైతులకు అదనపు ధర.. పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు.
రైల్వే బోర్డు సభ్యుల కు వినతి పత్రం సమర్పించిన రైల్వే జేఏసీ .
కన్నవారే కాదంటే.. వృద్ధులకు మేమున్నామంటూ బాలవికాస భరోసా!
ఎర్రబెల్లి సంపత్ రావుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్ష పదవి.. మూడోసారి అవకాశం!
ఎండిపోతున్న పంటలకు జీవజలం.