బీఆర్ఎస్ ధర్నా ఓ రాజకీయ డ్రామా.

బీఆర్ఎస్ ధర్నా ఓ రాజకీయ డ్రామా.

*ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.*
 
*బీఆర్ఎస్–బీజేపీ రాజకీయ అవగాహనపై వైద్యుల అంజన్ కుమార్ ఫైర్.*

కరీంనగర్, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు): 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నా రాజకీయ డ్రామా అని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ విమర్శించారు. మేయర్ ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చి గెలిపించిన బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు ప్రజా సమస్యలు గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించారు.

బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలేమిటని నిలదీస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం రెండు పార్టీలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని అన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

మరోవైపు, రాబోయే బతుకమ్మ, దసరా పండుగలను దృష్టిలో ఉంచుకుని నగరంలో వీధి దీపాలు, పారిశుధ్యం తదితర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను డిమాండ్ చేశారు. పండుగల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యుల అంజన్ కుమార్ కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం!
ధర్మసాగర్,అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):  రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ...
రైతులకు అదనపు ధర.. పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు.
రైల్వే బోర్డు సభ్యుల కు వినతి పత్రం సమర్పించిన రైల్వే జేఏసీ .
కన్నవారే కాదంటే.. వృద్ధులకు మేమున్నామంటూ బాలవికాస భరోసా!
ఎర్రబెల్లి సంపత్ రావుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్ష పదవి.. మూడోసారి అవకాశం!
ఎండిపోతున్న పంటలకు జీవజలం.