నీటిని పొదుపుగా వాడుకోవాలి.. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి.

నీటిని పొదుపుగా వాడుకోవాలి.. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి.

*ఆర్‌సీసీ, ఎస్‌డబ్ల్యూజీ పైప్‌లైన్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ.*

*31వ డివిజన్‌లో రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్.*

కరీంనగర్, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

గ్లోబల్ వార్మింగ్, ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో నగర ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల్లో భాగంగా శనివారం 31వ డివిజన్‌లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు. ఖాన్‌పూర్ రోడ్ నంబర్ 11లో స్థానిక కార్పొరేటర్ సయ్యద్ ముఖద్దర్ హుస్సేన్ అలీతో కలిసి యూఐడీఎఫ్ నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ప్రవిష్టా రోడ్డులో రూ.19.40 లక్షలు, మరో ప్రాంతంలో రూ.30.60 లక్షల వ్యయంతో రెండు చోట్ల ఆర్‌సీసీ, ఎస్‌డబ్ల్యూజీ పైప్‌లైన్ డ్రైనేజీ, సీసీ ప్యాచ్‌లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను మేయర్ ఆదేశించారు. నగర అభివృద్ధితో పాటు నీటి సంరక్షణకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం! జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం!
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...
దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.
కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి!
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి.
రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.
నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.