కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.

మధ్యలో ఆగిపోయిన నోములు కూడా కొనసాగించరాదు.. భక్తులకు సూచన.

కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.

ఎల్కతుర్తి, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): 

ఈ ఏడాది కొత్త నోములు ప్రారంభించడానికి, గతంలో మధ్యలో ఆగిపోయిన నోములను కొనసాగించడానికి వీలులేదని వల్లభాపురం శ్రీ పశుపతినాథ్ దేవస్థానం అర్చకులు, వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి వెల్లడించారు. పండుగలు, వ్రతాల ఆచరణలో భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో నిర్వహించనున్న పూజా కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ఏడాది దీపావళి పండుగను నవంబర్ 8వ తేదీ ఆదివారం జరుపుకోవాలని తెలిపారు. ఆ రోజు ఉదయం ఆలయంలో మంగళహారతులు, దీపావళి పూజలు, ధనలక్ష్మి పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

నవంబర్ 9వ తేదీ సోమవారం కేదారేశ్వర వ్రతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది స్వాతి కార్తె లేనందున కొత్త నోములు ప్రారంభించరాదని, గతంలో మధ్యలో ఆగిపోయిన నోములను కూడా కొనసాగించకూడదని వివరించారు.

భక్తులు పండుగలు, వ్రతాల విషయంలో ఈ సూచనలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం! జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం!
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...
దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.
కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి!
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి.
రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.
నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.