లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలి.
స్టేషన్ ఘన్‌పూర్‌లో సీఐటీయూ ధర్నా పోస్టర్ల ఆవిష్కరణ
కార్మికులకు నెలకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి
స్టేషన్ ఘన్పూర్,అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని, కార్మికులకు నెలకు రూ.30 వేల కనీస వేతనం నిర్ణయించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న బహుళ రోజుల ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.మున్సిపల్ వర్కర్స్ యూనియన్, సివిల్ సప్లై యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ ఎదునూరి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించి, పీఆర్సీని వర్తింపజేయాలని కోరారు. హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ మండలిని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
అక్టోబర్ 26న జరిగే ధర్నాలో పథక కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు, విశ్వవిద్యాలయ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పెన్షనర్లు, బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రవాణా రంగ కార్మికులు, హమాలీలు పాల్గొననున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పిట్టల తిరుపతి, నీల శ్రీని
వాస్, ఎడ్ల రాజు, ప్రవీణ్, పూర్ణచందర్, లాజర్, సారయ్య, భాస్కర్, ప్రభాకర్, లక్ష్మీ, బిక్షపతి, రాజకుమార్, రాజు, కుమార్, పరమేష్, యాదగిరి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


Comments