రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.

కడియం శ్రీహరి, పొట్లపల్లి శ్రీధర్ రావు ఆదేశాలతో కాంగ్రెస్ శ్రేణుల ఇంటింటి ప్రచారం.

రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.

చిల్పూర్, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆదేశాల మేరకు శుక్రవారం చిల్పూర్ మండలంలోని రాజవరం గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గ్రామంలోని పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు నవంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందస్తుగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ముఖ్యమని నాయకులు పేర్కొన్నారు. అర్హులెవరూ నమోదు ప్రక్రియకు దూరం కాకుండా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు గౌడ్, జిల్లా కార్యదర్శి గడ్డమీది సురేష్, మాజీ ఎంపీపీ సరిత బాలరాజ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసురం కృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల ఎల్లయ్య, గుట్ట దేవస్థానం డైరెక్టర్లు బత్తుల సూర్యనారాయణ, ఎడ్ల యాదగిరి, మొగిలి, నర్సయ్య, రాజేష్, వెంకన్న, కనకరాజు, గణేష్‌తో పాటు పట్టభద్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం! జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం!
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...
దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.
కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి!
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి.
రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.
నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.