రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా?
బీఆర్ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి.
పెద్దమందడి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
రైతుల సమస్యలను రాజకీయ విమర్శలతో పక్కదారి పట్టించకుండా, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల బీఆర్ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.అల్వాల గ్రామంలో విద్యుత్ కోతలు, సాగునీటి కొరతతో ఎండిపోతున్న వరి పంటలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. అనంతరం విద్యుత్ అధికారులు గ్రామాన్ని సందర్శించి అదనంగా రెండు గంటల విద్యుత్ సరఫరాకు అంగీకరించారని పేర్కొన్నారు.రైతుల సమస్యలను ప్రస్తావిస్తే విమర్శలు చేయడం సరికాదని, రైతులకు కావాల్సింది రాజకీయ మాటలు కాదని, సకాలంలో విద్యుత్, సాగునీరు అందించి పంటలను కాపాడటమేనని వెంకట్ రెడ్డి అన్నారు. అదనపు విద్యుత్‌తో పాటు రైతుల పంటలను రక్షించేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Comments