మానవత్వానికి ప్రతీక రక్తదానం.. ప్రాణదాతలుగా నిలిచిన రక్తదాతలు!
*సచిన్ వాకర్స్ ఆధ్వర్యంలో మూడవ మహా రక్తదాన శిబిరం*
*రక్తదాన శిబిరాన్ని సందర్శించిన ఏసీపీ మాధవి..*
*రక్తదాతలకు పండ్ల పంపిణీ చేసిన సాయి సోషల్ మీడియా*
హుజురాబాద్ /కందుగుల,అక్టోబర్ 25(తెలంగాణ ముచ్చట్లు ):
సచిన్ వాకర్స్ ఆధ్వర్యంలో కందుగుల జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో మూడవ మహా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఏ ఒక్కరి ప్రాణం కోల్పోకూడదనే లక్ష్యంతో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఏసీపీ మాధవి సందర్శించి రక్తదాన శిబిరం నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రక్తదానం అనేది అత్యంత గొప్ప మానవతా సేవ అని, మనం ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేలా చూడవచ్చని పేర్కొన్నారు.
రక్తదానం చేసిన వారిని అభినందిస్తూ, సమాజ సేవలో యువత చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసినట్లవుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయని పేర్కొన్నారు.
రక్తదాతలకు పండ్ల పంపిణీ..
ఈ కార్యక్రమంలో భాగంగా సాయి సోషల్ మీడియా ఆధ్వర్యంలో రక్తదానం చేసిన రక్తదాతలకు పండ్లు పంపిణీ చేశారు. రక్తదాతలను ప్రోత్సహిస్తూ, వారి సేవలను గౌరవిస్తూ పండ్లు అందించడం ద్వారా సాయి సోషల్ మీడియా నిర్వాహకులు సాయి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. రక్తదాతల సేవలను అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.
సచిన్ వాకర్స్ ఆధ్వర్యంలో మూడవసారి మహా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. రక్తదానం ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సేవా భావాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని పలువురు అభిప్రాయపడ్డారు.
రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి.. అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం సేవాభావానికి, మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.


Comments