హుజురాబాద్‌లో వ్యవసాయ మోటార్ చోరీ.
*రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు విలువ.. నిందితులను పట్టుకోవాలని బాధితుడి ఫిర్యాదు*
హుజురాబాద్, అక్టోబర్ 25(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన ఇప్పలపల్లి శంకర్‌కు బతుకమ్మ సౌళ్లలోని చెక్‌డ్యామ్ సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో శంకర్ తన పొలం వద్దకు వెళ్లగా, అక్కడ ఉండాల్సిన వ్యవసాయ మోటార్ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల పరిసరాల్లో ఎంత వెతికినా మోటార్ ఆచూకీ లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు దానిని దొంగిలించినట్లు బాధితుడు నిర్ధారించుకున్నాడు.
రూ.60 వేల వరకు నష్టం
చోరీకి గురైన వ్యవసాయ మోటార్ విలువ సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుందని బాధితుడు శంకర్ పేర్కొన్నాడు. వ్యవసాయ పనులకు ఎంతో కీలకమైన మోటార్ చోరీకి గురికావడంతో తనకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
నిందితులను పట్టుకుని మోటార్ రికవరీ చేయాలివ్యవసాయ మోటార్‌ను దొంగిలించిన గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించి, మోటార్‌ను రికవరీ చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు ఇప్పలపల్లి శంకర్ హుజురాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టి, చోరీకి పాల్పడిన వారిని గుర్తించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.


Comments