గ్రామాల్లో బీజేపీకి ఊపు.. కోతులనడుమ, గోపాల్పూర్‌లో బూత్ కమిటీలు.

పలువురి బీజేపీలో చేరిక.. నూతన బూత్ అధ్యక్షుల ఎన్నిక.

గ్రామాల్లో బీజేపీకి ఊపు.. కోతులనడుమ, గోపాల్పూర్‌లో బూత్ కమిటీలు.

ఎల్కతుర్తి అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు): 

భారతీయ జనతా పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కోతులనడుమ, గోపాల్పూర్ గ్రామాల్లో బీజేపీ బూత్ కమిటీల ఏర్పాటు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షత వహించారు.

కోతులనడుమ గ్రామంలో 285, 286 బూత్‌లకు అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కనిపర్తి శామ్ సుందర్, ఎర్రోళ్ల అఖిల్, మాట్ల వినయ్, రావుల శ్రీధర్, మాట్ల విశాల్, రావుల శ్రీకాంత్, పల్లపు శ్రీను, గట్టు శ్రీనివాస్ బీజేపీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అదేవిధంగా గోపాల్పూర్ గ్రామంలో 305వ బూత్ అధ్యక్షుడిగా కుమ్మరి సతీష్, 306వ బూత్ అధ్యక్షుడిగా చిత్రాల భాస్కర్, 307వ బూత్ అధ్యక్షుడిగా ఉప్పుల శివప్రకాష్ ఎన్నికయ్యారు. చేరికల కమిటీ సభ్యుడిగా చిదురల వెంకటేష్‌ను నియమించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి బూత్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

ఈ కార్యక్రమాల్లో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు అల్లి కుమార్, చిత్రాల వెంకటేష్, సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఎర్రోళ్ల రాజు, మడిపల్లి కొమురయ్య, మాట్ల జయేందర్, చిరంజీవితదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. IMG-20261025-WA0018

Tags:

Post Your Comments

Comments

Latest News

బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్.
స్టేషన్ ఘన్ పూర్,అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):  స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా అరుణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ...
మంగంపల్లి ఘటనపై ఎమ్మార్పీఎస్ రౌండ్ టేబుల్ సమావేశం.
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.
విద్యార్థి ప్రతిభకు ఎమ్మెల్యే ఆర్థిక ప్రోత్సాహం.
హుజురాబాద్‌లో వ్యవసాయ మోటార్ చోరీ.
ముప్పారం–వేములవాడకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు.