అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.

పెద్దమందడి, కాంగ్రెస్ నాయకులు.

అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.

పెద్దమందడి,అక్టోబర్25(తెలంగాణ ముచ్చట్లు):

అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఐ. సత్యారెడ్డి, పెద్దమందడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో వెంకటేశ్వర కాలనీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పట్టభద్రులు, ఉద్యోగులకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యంలో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి సర్పంచ్ గంగమ్మ రవి, నరేష్, రాఘవేందర్, ఎన్. రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్.
స్టేషన్ ఘన్ పూర్,అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):  స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా అరుణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ...
మంగంపల్లి ఘటనపై ఎమ్మార్పీఎస్ రౌండ్ టేబుల్ సమావేశం.
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.
విద్యార్థి ప్రతిభకు ఎమ్మెల్యే ఆర్థిక ప్రోత్సాహం.
హుజురాబాద్‌లో వ్యవసాయ మోటార్ చోరీ.
ముప్పారం–వేములవాడకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు.