25 నుంచి జిల్లాలో గొర్రెలు, మేకల పెంపకందారుల సర్వేలు.

25 నుంచి జిల్లాలో గొర్రెలు, మేకల పెంపకందారుల సర్వేలు.

ప్రభుత్వం హామీలను మరిచింది

– జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు మోటే దేవేందర్

చిల్పూర్, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

ఈ నెల 25 నుంచి నవంబర్ 10 వరకు జిల్లావ్యాప్తంగా గొర్రెలు, మేకల పెంపకందారుల సర్వేలు నిర్వహించనున్నట్లు గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా అధ్యక్షుడు మోటే దేవేందర్ తెలిపారు. చిల్పూర్‌లో నిర్వహించిన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి జిల్లా గౌరవ అధ్యక్షుడు సాదం రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, గొర్రెల పెంపకందారుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రానున్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామంలో గొర్రెలకు నీటి తొట్లు, ఉచిత దాణా, సామూహిక షెడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పశువైద్య పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, 50 ఏళ్లు నిండిన గొర్రెల కాపరులకు నెలకు రూ.5 వేల పెన్షన్ అందించాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన కాపరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు జీగారి యాదగిరి, గుండా వెంకటయ్య, మేకల మల్లేష్, ఎక్కల రాజబీరయ్య, సహాయ కార్యదర్శులు ఆవుల ప్రభాకర్, జిట్టబోయిన రమేష్, బొమ్మరబోయిన శివ, గద్ద రాజు, మోటిక తిరుపతి, జల్లెల రవితో పాటు ఎనిమిది మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం! జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం!
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...
దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.
కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి!
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి.
రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.
నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.