రైతుల సమస్యలపై రాజకీయం తగదు.

అల్వాల కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్ రెడ్డి.

రైతుల సమస్యలపై రాజకీయం తగదు.

పెద్దమందడి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాజకీయాలకు వాడుకోవడం తగదని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం  అల్వాల గ్రామ కాంగ్రెస్ నాయకుడు జి. సుదర్శన్ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా విద్యుత్ కొరత వల్లే పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంటలు ఎండిపోవడానికి గల కారణాలు, సాగునీటి ఇబ్బందులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై చర్చించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, సాగునీటి కొరత కారణంగా కొన్ని పొలాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వివరించినట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు.గ్రామంలో సాగునీటి సమస్యను అధిగమించేందుకు కేఎల్‌ఐ కాలువల నుంచి వచ్చే నీటిని చెరువుకు మళ్లించేందుకు గ్రామ నాయకులు, యువకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుని పంటలను కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, పొలాలకు నీరందించుకునేందుకు గ్రామానికి అదనంగా మరో రెండు గంటల విద్యుత్ సరఫరా చేయాలని రైతులు విద్యుత్ శాఖ అధికారులను కోరారు. రైతుల విజ్ఞప్తిపై డీఈ ఎ. శ్రీనివాస్, ఏడీఈ శివశంకర్ రెడ్డి, ఏఈ ఆర్. హేమంత్ గౌడ్, లైన్‌మెన్ గోవర్ధన్ గౌడ్ సానుకూలంగా స్పందించి అంగీకరించినట్లు తెలిపారు.రైతుల సమస్యలను రాజకీయ విమర్శలకు పరిమితం చేయకుండా, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి కోరారు. రైతులకు అండగా నిలిచి, వారి పంటలను కాపాడేందుకు అధికారులు, గ్రామస్థులు కలిసి పనిచేయాలని ఆయన అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం! జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం!
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...
దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.
కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి!
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి.
రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.
నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.