రక్తదానం ప్రాణదానంతో సమానం: జక్కుల అనిల్ యాదవ్.

రక్తదానం ప్రాణదానంతో సమానం: జక్కుల అనిల్ యాదవ్.

పోలీస్‌ సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం.. పాల్గొన్న భీమదేవరపల్లి మండల యువత

భీమదేవరపల్లి, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాజీపేట డివిజన్‌ పరిధిలోని మడికొండ గార్డెన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో భీమదేవరపల్లి మండల యువత పాల్గొని రక్తదానం చేశారు.మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జక్కుల అనిల్‌ కుమార్‌ యాదవ్‌ యువతను సమన్వయం చేసి శిబిరం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం అంటే కేవలం రక్తాన్ని ఇవ్వడం మాత్రమే కాదని, ఒక ప్రాణాన్ని నిలబెట్టడమేనని అన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రక్తదానం చేసిన యువతను ఏసీపీ ప్రశాంత్‌ రెడ్డి అభినందించగా, ముల్కనూర్‌ ఎస్సై ఎం. రాజు సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని సూచించారు.రక్తదానం చేసిన యువత: అదరి రాజేందర్‌, రాజేష్‌, కత్తుల అజయ్‌ కుమార్‌, ఎల్ది వినోద్‌, గుల్ల తిరిష్‌, మేకల హరీష్‌, అమకవర్షి, సందీప్‌, కృషిధర్‌, జయంత్‌, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం! జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం!
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...
దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.
కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి!
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి.
రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.
నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.