ఎల్ నినో విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం.
*ప్రజలు నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించుకోవాలి.*
*విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి.*
*కరీంనగర్, అక్టోబర్ 24(తెలంగాణ ముచ్చట్లు ):*
ఎల్ నినో ప్రభావంతో తలెత్తే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని, నీటిని, విద్యుత్తును పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఎల్ నినో ప్రభావం దాదాపు వంద దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి సహకరించాల్సిన ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.
కరోనా సంక్షోభ సమయంలో అప్పటి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సహకరించలేదా అని ప్రశ్నించారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. నీరు, విద్యుత్తు పొదుపు విషయంలో ప్రజలందరూ భాగస్వాములై ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.


Comments