చిల్పూర్ గుట్టలో ఘనంగా బుగులు వెంకన్న స్వామి వార కల్యాణం.
వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా వేడుకలు..
పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
చిల్పూర్ గుట్ట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
చిల్పూర్ గుట్టపై కొలువైన శ్రీశ్రీశ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి వార కల్యాణ మహోత్సవాన్ని శనివారం వేదమంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఆలయ ప్రాంగణంలో అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గనగోని రమేష్, గోలి రాజశేఖర్, గొల్లపల్లి వాసు గౌడ్, యాదగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి బి. లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆదిత్యతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.


Comments