నిధులు మంజూరయ్యాయి.. కొనుగోళ్లేవీ?

నిధులు మంజూరయ్యాయి.. కొనుగోళ్లేవీ?

జనగామ జిల్లాలో మత్స్య సంఘాల డిజిటలైజేషన్‌లో జాప్యం

ఎన్నికలు జరగక బ్యాంకుల్లోనే నిలిచిన నిధులు

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): 

కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్య సహకార సంఘాల డిజిటలైజేషన్ కోసం నిధులు మంజూరవుతున్నా.. కొన్ని సంఘాల్లో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. పాలకవర్గాల పదవీకాలం ముగియడం, ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం కారణంగా నిధులను డ్రా చేసుకోలేకపోతున్నామని సంబంధిత సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.జనగామ జిల్లాలో మొత్తం 193 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. జాతీయ మత్స్య డిజిటల్ వేదిక (ఎన్‌ఎఫ్‌డీబీ) ద్వారా ఒక్కో సంఘానికి రూ.90 వేల చొప్పున పూర్తి సబ్సిడీతో నిధులు మంజూరు చేస్తున్నారు. ఈ నిధులతో కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌తో పాటు టేబుళ్లు, కుర్చీలు కొనుగోలు చేసి కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం అమలులో బీకేఎస్‌ఎల్‌, వైకే లిబ్రా, ఐఈడీ, కేవీఎస్‌ఎస్‌ఎల్‌ సంస్థలు పనిచేస్తున్నాయి.
అయితే, నిధులు మంజూరైనప్పటికీ కొన్ని సంఘాల్లో కొనుగోళ్లు పూర్తికాకపోవడంపై చర్చ జరుగుతోంది. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో బ్యాంకు అధికారులు నగదు ఉపసంహరణకు అనుమతించడం లేదని, దీంతో మంజూరైన నిధులు బ్యాంకు ఖాతాల్లోనే నిలిచిపోయాయని సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఎన్నికలు త్వరగా నిర్వహిస్తే నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుందని కోరుతున్నారు.


తొలి విడతలో 33 సంఘాల్లో కొనుగోళ్లు పూర్తి

ఈ అంశంపై ఫిషరీస్‌ ఎక్స్‌పర్ట్‌ చింతల సాయి అర్చన స్పందిస్తూ.. బీకేఎస్‌ఎల్‌, వైకే లిబ్రా సంస్థల ద్వారా తొలి విడతలో 33 మత్స్య సహకార సంఘాలకు నిధులు మంజూరయ్యాయని, ఆయా సంఘాల్లో కంప్యూటర్లు, ఫర్నిచర్‌ కొనుగోళ్లు పూర్తయ్యాయని తెలిపారు.తమ రెండు సంస్థల పరిధిలో జిల్లాలోని 93 సంఘాలకు గాను 75 సంఘాలకు నిధులు మంజూరు చేయించినట్లు వివరించారు. వారం క్రితం మరికొన్ని సంఘాలకు నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కొన్ని సంఘాల్లో పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో బ్యాంకు అధికారులు డబ్బులు డ్రా చేసుకునేందుకు అనుమతించడం లేదని, ఫలితంగా నిధులు ఖాతాల్లోనే నిలిచిపోయాయని చెప్పారు. ఆయా సంఘాIMG-20261024-WA0037లకు వెంటనే ఎన్నికలు నిర్వహిస్తే నిధులను డ్రా చేసుకుని అవసరమైన పరికరాలు, ఫర్నిచర్‌ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని సాయి అర్చన వివరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం! జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం!
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...
దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.
కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి!
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి.
రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.
నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.