శివాలయ అభివృద్ధికి రూ.20 వేల విరాళం అందించిన మందడి సరోజ్ రెడ్డి.
Views: 0
On
దేవరకద్ర,అక్టోబర్24తెలంగాణ ముచ్చట్లు):
దేవరకద్ర నియోజకవర్గంలోని గాజులపేట గ్రామంలో ఉన్న శివాలయ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, హైకోర్టు న్యాయవాది మందడి సరోజ్ రెడ్డి రూ.20 వేల విరాళం అందించారు.శివాలయ అభివృద్ధికి సహకరించాలని గ్రామస్థులు మందడి సరోజ్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయగా, ఆయన వెంటనే స్పందించి రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా గ్రామస్థులు ఆకాంక్షించారు.శివాలయ అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించిన మందడి సరోజ్ రెడ్డికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామంలోని ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దాతలు సహకరించడం వల్ల గ్రామాల్లోని సామాజిక, సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణకు తోడ్పాటు లభిస్తుందని గ్రామస్థులు పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
24 Oct 2026 22:02:09
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...


Comments