వి.బి.జి. రామ్ జీ పథకం ద్వారా పనులు ప్రారంభించిన సర్పంచ్ బిల్లా యాదగిరి.
వేలేరు, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వి.బి.జి. రామ్ జీ పథకం ద్వారా 40 నూతన వ్యక్తిగత ఇంకుడు గుంతలు మంజూరయ్యాయి. ఈ పనులను వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇంటి నుంచి వెలువడే వంటగది, బాత్రూమ్ వ్యర్థ జలాలతో పాటు వర్షపు నీటిని కూడా ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకింపజేయవచ్చని వివరించారు. దీనివల్ల భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు నీటి వనరుల సంరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఇంకుడు గుంతల నిర్మాణంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడంతో ఒకేసారి 40 కుటుంబాలకు వ్యక్తిగత ఇంకుడు గుంతలు మంజూరయ్యాయని తెలిపారు. మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ, వార్డు సభ్యుడు సునీల్, ఆత్మ డైరెక్టర్ చంద్రమౌళి, సతీష్, సంపత్ రెడ్డి, రాజశేఖర్, శ్రావణ్, తిరుపతి, నరసయ్య, రమేష్, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.


Comments