శేరుపల్లి విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు.

సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్.

శేరుపల్లి విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు.

శ్రీరంగాపురం,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):

పల్లె బడుల్లో చదువుకుంటూ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న శేరుపల్లి విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ కొనియాడారు. శ్రీరంగాపురం మండలం శేరుపల్లి గ్రామానికి చెందిన ప్రతిభావంతులైన ఐదుగురు విద్యార్థులను శనివారం సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదుగుతున్న విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకొని, తమ ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు.ఇటీవల రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ (కత్తియుద్ధం) పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన సురేఖ, భువనేశ్వర్‌లోని సైనిక్ స్కూల్‌లో ప్రవేశం పొందిన భార్గవ్, సీఈఓ కాలేజీలో సీటు సాధించిన రూప, ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ఫైనల్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన వర్షలను కళా వేదిక ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. మరో విద్యార్థిని కూడా కార్యక్రమంలో సన్మానించారు.విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల అంకితభావం, మార్గదర్శకత్వం ఎంతో ఉందని పలుస శంకర్ గౌడ్ పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ వారి ప్రతిభను వెలికితీస్తున్న ఉపాధ్యాయులు నరసింహ, రమేష్, ఈశ్వర్ రెడ్డి, ప్రసన్నలను కూడా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల వెంకటయ్య, ఉప సర్పంచ్ బిచ్చన్న, ఎంఈఓ హనుమంతు, సాహితీ కళా వేదిక ప్రతినిధి బైరోజు చంద్రశేఖర్, రంగస్థల కళాకారుల జిల్లా అధ్యక్షుడు ఎల్. ఉమామహేశ్వర్, మొయినుద్దీన్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం! జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం!
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...
దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.
కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి!
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి.
రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.
నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.