ఓబీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం!

బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించింది బీజేపీనే: నాయకులు.

ఓబీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం!

చిల్పూర్, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): 

ఓబీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యత, రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ నాయకులు అన్నారు. చిల్పూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పోచం సోమయ్య, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ రవి మాట్లాడారు.2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన పార్టీ బీజేపీనే అని వారు పేర్కొన్నారు. బీసీలకు రాజకీయంగా ఎక్కువ అవకాశాలు కల్పించడంతోపాటు, కేంద్ర మంత్రివర్గంలోనూ ఓబీసీలకు ప్రాతినిధ్యం కల్పించిందని తెలిపారు.102వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో బీసీ విద్యార్థులు, పరిశోధకులకు వివిధ విద్యా అవకాశాలు అందుతున్నాయని పేర్కొన్నారు. జాతీయ ఓబీసీ ఫెలోషిప్‌ ద్వారా ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ చేసే విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఇంటి అద్దె భత్యం వంటి ప్రయోజనాలు లభిస్తున్నాయని వివరించారు.

ఓబీసీలు రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే సంఘటితంగా ముందుకు సాగాలని, బీసీల హక్కులు, ప్రాతినిధ్యం కోసం బీజేపీతో కలిసి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా నాయకులు పెండ్యాల దిలీప్ కుమార్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊరడి రాజు ముదిరాజ్, ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్కెర రమేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, మండల నాయకులు గొల్లపెల్లి శైలేష్ గౌడ్, కన్నెబోయిన అఖిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం! జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం!
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...
దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.
కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి!
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి.
రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.
నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.