రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి.
*రైతులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించాలి.*
*పారదర్శకంగా పనిచేస్తూ రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి.*
*బెజ్జంకి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అభినందనలు.*
మానకొండూరు, అక్టోబర్ 25(తెలంగాణ ముచ్చట్లు ):
బెజ్జంకి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన మాతంగి శిరీష అనిల్, వైస్ చైర్మన్‌గా నియమితులైన పర్ష సంతోష్‌తో పాటు ఇతర డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులను మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా సన్మానించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ ప్రజాభవన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకొని పనిచేయాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, పంటల అభివృద్ధికి తోడ్పడటం, రైతులకు తమ ఉత్పత్తులకు న్యాయమైన ధరలు లభించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
మార్కెట్ కమిటీ పారదర్శకంగా పనిచేస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల రైతులకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా నూతన చైర్మన్ మాతంగి శిరీష అనిల్, వైస్ చైర్మన్ పర్ష సంతోష్, ఇతర డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


Comments