విద్యార్థి ప్రతిభకు ఎమ్మెల్యే ఆర్థిక ప్రోత్సాహం.

విద్యార్థి ప్రతిభకు ఎమ్మెల్యే ఆర్థిక ప్రోత్సాహం.

పెద్దమందడి,అక్టోబర్25(తెలంగాణ ముచ్చట్లు):

విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముందుకొచ్చారు. పెద్దమందడి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన అల్వాల గ్రామ యువకుడు సోమేష్ రూపొందించిన ఆటోమేటిక్ బైక్ స్టాండ్ క్లోజర్ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో, అతడికి రూ.40 వేల ఆర్థిక సాయం అందించారు.ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలో సోమేష్ తన ప్రాజెక్టును ప్రదర్శించాడు. బైక్ నడిపేటప్పుడు స్టాండ్ తీయడం మరిచిపోవడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించేలా ఈ వినూత్న పరికరాన్ని రూపొందించాడు. దేశవ్యాప్తంగా 790 ప్రాజెక్టులు ప్రదర్శించిన జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలో తెలంగాణ నుంచి ఎంపికైన 52 ప్రాజెక్టుల్లో సోమేష్ ప్రాజెక్టుకు చోటు దక్కింది.సోమేష్ ప్రతిభను అల్వాల గ్రామ కాంగ్రెస్ నాయకుడు జి. సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించి విద్యార్థిని అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్.
స్టేషన్ ఘన్ పూర్,అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):  స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా అరుణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ...
మంగంపల్లి ఘటనపై ఎమ్మార్పీఎస్ రౌండ్ టేబుల్ సమావేశం.
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.
విద్యార్థి ప్రతిభకు ఎమ్మెల్యే ఆర్థిక ప్రోత్సాహం.
హుజురాబాద్‌లో వ్యవసాయ మోటార్ చోరీ.
ముప్పారం–వేములవాడకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు.