వెల్టూర్ గోపాల సముద్రం చెరువు సుందరీకరణకు గ్రీన్ సిగ్నల్.

కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్ హర్షం .

వెల్టూర్ గోపాల సముద్రం చెరువు సుందరీకరణకు గ్రీన్ సిగ్నల్.

పెద్దమందడి,అక్టోబర్25(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని వేణు గోపాల సముద్రం చెరువు సుందరీకరణతో కొత్త రూపు సంతరించుకోనుంది. చెరువు పరిసరాలను అందంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల గ్రామ కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్ హర్షం వ్యక్తం చేశారు.చెరువు సుందరీకరణతో పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే కేంద్రంగా వేణు గోపాల సముద్రం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువు పరిసరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే వెల్టూర్ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రతిపాదనలతో వేణు  గోపాల సముద్రం చెరువు అభివృద్ధికి అవకాశం కలగడం అభినందనీయమని వడ్డే శేఖర్ అన్నారు. ఈ పనులకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చెరువు సుందరీకరణ పనులను త్వరగా చేపట్టి నాణ్యతతో పూర్తి చేయాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్.
స్టేషన్ ఘన్ పూర్,అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):  స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా అరుణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ...
మంగంపల్లి ఘటనపై ఎమ్మార్పీఎస్ రౌండ్ టేబుల్ సమావేశం.
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.
విద్యార్థి ప్రతిభకు ఎమ్మెల్యే ఆర్థిక ప్రోత్సాహం.
హుజురాబాద్‌లో వ్యవసాయ మోటార్ చోరీ.
ముప్పారం–వేములవాడకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు.