ముకరంపురలో ‘టీఎస్ ఇన్సూరెన్స్ హబ్’ ప్రారంభం.

ముకరంపురలో ‘టీఎస్ ఇన్సూరెన్స్ హబ్’ ప్రారంభం.

*వాహనదారులకు సులభంగా బీమా సేవలు.. నిర్వాహకులు షాకీర్‌కు అభినందనలు.*

*ప్రారంభించిన డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు.*

కరీంనగర్, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ నగరంలోని వాహనదారులకు మెరుగైన, సులభమైన బీమా సేవలు అందించే లక్ష్యంతో ముకరంపురలోని పరివార్ బేకరీ లేన్‌లో ఏర్పాటు చేసిన ‘టీఎస్ ఇన్సూరెన్స్ హబ్’ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు షాకీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు, వాణిజ్య వాహనాలకు సంబంధించిన బీమా సేవలు ఒకే చోట అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. వాహనదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

టీఎస్ ఇన్సూరెన్స్ హబ్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలకు రూ.850 నుంచి రూ.2,500 వరకు, నాలుగు చక్రాల వాహనాలకు రూ.2,500 నుంచి రూ.20,000 వరకు బీమా సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాహన మోడల్, ఐడీవీ (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ) ఆధారంగా బీమా ప్రీమియం మారుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు తమ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) కార్డును వాట్సాప్ ద్వారా పంపించి, వెంటనే బీమా కొటేషన్ పొందవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాజిద్ హుస్సేన్, ఇబ్రహీం, పడాల శ్రీజ, అజయ్, మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి, నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్.
స్టేషన్ ఘన్ పూర్,అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):  స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా అరుణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ...
మంగంపల్లి ఘటనపై ఎమ్మార్పీఎస్ రౌండ్ టేబుల్ సమావేశం.
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.
విద్యార్థి ప్రతిభకు ఎమ్మెల్యే ఆర్థిక ప్రోత్సాహం.
హుజురాబాద్‌లో వ్యవసాయ మోటార్ చోరీ.
ముప్పారం–వేములవాడకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు.