ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రైవేటు బస్సు.
* ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసం..
* ప్రయాణికులకు తప్పిన గాయాలు
జమ్మికుంట, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు మధ్యలో అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ, డ్రైవర్, కండక్టర్‌తో పాటు ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.
పోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామానికి చెందిన ఈసం పెళ్లి లోకేష్ గత ఆరేళ్లుగా ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం బస్సు నంబర్ టీఎస్ 02 యూసీ 6088తో కుందనపల్లి నుంచి జమ్మికుంట వైపు వస్తుండగా, కోరపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనకు ముందుగా ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్‌ను నడుపుతున్న యూనిస్ సలీం రోడ్డు మధ్యలో అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టిందని డ్రైవర్ ఫిర్యాదులో తెలిపాడు. ఈ ఘటనలో బస్సు ముందు బంపర్, అద్దం, రేడియేటర్ పైపులు ధ్వంసమైనట్లు పేర్కొన్నాడు.
ఫిర్యాదు ఆధారంగా ట్రాక్టర్ డ్రైవర్ యూనిస్ సలీంపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Comments