నిరుపేద ఆర్యవైశ్య భక్తులకు అయోధ్య, కాశీ ఉచిత యాత్ర.

నిరుపేద ఆర్యవైశ్య భక్తులకు అయోధ్య, కాశీ ఉచిత యాత్ర.

*45 ఆర్యవైశ్య వృద్ధ జంటలకు ఉచిత ఆధ్యాత్మిక యాత్ర.*

*గంప నారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాత్రకు శ్రీకారం.*

*జెండా ఊపి ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డిప్యూటీ మేయర్  సునీల్ రావు.*

కరీంనగర్, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

ఆర్యవైశ్య నిరుపేద భక్తులకు పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం కల్పించాలనే లక్ష్యంతో గంప నారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయోధ్య–కాశీ ఉచిత ఆధ్యాత్మిక యాత్ర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. కరీంనగర్‌లోని వైశ్య భవన్, సాయిబాబా టెంపుల్ వద్ద 45 ఆర్యవైశ్య వృద్ధ జంటల కోసం ఏర్పాటు చేసిన రెండు బస్సులను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. గంప శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత యాత్ర మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్య నిరుపేద భక్తుల కోసం గంప శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో ఈ యాత్రను నిర్వహించడం గొప్ప సేవా కార్యక్రమమని కొనియాడారు. సుమారు ఎనిమిది రోజుల పాటు సాగే ఈ యాత్రలో భాగంగా రెండు ప్రత్యేక బస్సుల ద్వారా దాదాపు 45 వృద్ధ జంటలకు అయోధ్య, కాశీ తదితర పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు.

ఆధ్యాత్మిక సేవాభావంతో యాత్రను నిర్వహిస్తున్న గంప నారాయణ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. యాత్రకు బయలుదేరిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అయోధ్య రాముడి, కాశీ విశ్వేశ్వరుడి ఆశీస్సులతో భక్తుల యాత్ర సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎన్నం ప్రకాష్, గాజ శివరాం, వైశ్య సంఘం ప్రతినిధులు, బీజేపీ నాయకులు, ట్రస్ట్ నిర్వాహకులు, యాత్రకు బయలుదేరిన భక్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్.
స్టేషన్ ఘన్ పూర్,అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):  స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా అరుణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ...
మంగంపల్లి ఘటనపై ఎమ్మార్పీఎస్ రౌండ్ టేబుల్ సమావేశం.
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.
విద్యార్థి ప్రతిభకు ఎమ్మెల్యే ఆర్థిక ప్రోత్సాహం.
హుజురాబాద్‌లో వ్యవసాయ మోటార్ చోరీ.
ముప్పారం–వేములవాడకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు.