ముప్పారం–వేములవాడకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం.

కమ్మరిపేటతో పాటు పలు గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం.

ముప్పారం–వేములవాడకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం.

వేలేరు, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

 హనుమకొండ జిల్లా వేలేరు మండలం కమ్మరిపేట గ్రామం మీదుగా ముప్పారం నుంచి వేములవాడ వరకు నూతన బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఈ బస్సు మోతు తండా, బండ తండా, కమ్మరిపేట, వేలేరు, కొత్తకొండ, మల్లారం, హస్నాబాద్ మీదుగా వేములవాడకు చేరుకోనుంది.
ఉదయం 6:30 గంటలకు ముప్పారం నుంచి బయలుదేరే బస్సు ఉదయం 10 గంటలకు వేములవాడకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ముప్పారం చేరుకుంటుంది.
ఈ నూతన బస్సు సర్వీసు వల్ల ఆయా గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. భక్తులు వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లేందుకు, ఇతర అవసరాల కోసం ప్రయాణించే వారికి ఈ సర్వీసు ఉపయోగకరంగా ఉంటుందని కమ్మరిపేట సర్పంచ్ జోడుముంతల కిరణ్ తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు ఈ బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్.
స్టేషన్ ఘన్ పూర్,అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):  స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా అరుణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ...
మంగంపల్లి ఘటనపై ఎమ్మార్పీఎస్ రౌండ్ టేబుల్ సమావేశం.
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.
విద్యార్థి ప్రతిభకు ఎమ్మెల్యే ఆర్థిక ప్రోత్సాహం.
హుజురాబాద్‌లో వ్యవసాయ మోటార్ చోరీ.
ముప్పారం–వేములవాడకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు.