పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
వనపర్తి,నవంబర్06(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు నాగేంద్ర యాదవ్ మనవడు చిరంజీవి అభిరామ్ యాదవ్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చిన్నారి అభిరామ్ యాదవ్‌కు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ కుమార్ యాదవ్, మణిగిల్ల సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సేనాపతి, పురుషోత్తం రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, జగత్ పల్లి రాములు, అల్వాల వెంకట్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్ కుమార్ రెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


Comments