దామెరాలో కమలం జోరు.. బీజేపీలోకి ఎనిమిది మంది నాయకులు!

ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు.

దామెరాలో కమలం జోరు.. బీజేపీలోకి ఎనిమిది మంది నాయకులు!

ఎల్కతుర్తి, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

ఎల్కతుర్తి మండలంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం దిశగా చేరికల పరంపర కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామానికి చెందిన ఎనిమిది మంది నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. గురువారం సిద్ధిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు బీజేపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కొమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీలో చేరిన దామెరా గ్రామ నాయకులు ఒద్దుల రవి, ఒద్దుల సంపత్, పిప్పల విజేందర్, పండ్రాల రమేష్, కోప్పర ప్రభాకర్, కోప్పర సంబరాజు, సాతురి వరుణ్, ఠాకూర్ రోహిత్ సింగ్‌లకు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ ఎల్కతుర్తి మండలంలోని ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని, రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరనున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దామెరా శక్తి కేంద్ర ఇన్‌చార్జి శామ్ సింగ్, సాతురి ప్రభాకర్, చల్ల రవీందర్ రెడ్డి, పండ్రాల సదానందం, పండ్రాల రాజయ్య, నామిండ్ల ప్రవీణ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20261106-WA0028

Tags:

Post Your Comments

Comments

Latest News

జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు): క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్...
బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన కొయ్యడ మహేందర్.
మల్లికుదుర్ల పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్.
మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
మారుతి నగర్ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు.
గ్రామాభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు.
ఎంఎస్ఎఫ్ బలోపేతానికి నూతన కమిటీల ఏర్పాటు.