బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.

బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.

- గల్లంతైన ఐదుగురు మత్స్యకారులు.
- ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఐదుగురు అగ్నిమాపక సిబ్బందిని రక్షించిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం.
- సహాయక బృందాలను అభినందించిన మంత్రి తుమ్మల.
- బుధవారం సాయంత్రం నుంచి సహాయక చర్యలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి.

సత్తుపల్లి, నవంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి చెరువులో చోటుచేసుకున్న ప్రమాద ఘటన సుఖాంతమైంది. చెరువులో గల్లంతైన ఐదుగురు మత్స్యకారులతో పాటు, వారిని రక్షించేందుకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న ఆIMG-20261105-WA0006IMG-20261105-WA0001రుగురు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, ఐదుగురు అగ్నిమాపక శాఖ సిబ్బందిని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. మొత్తం 16 మంది క్షేమంగా బయటపడటంతో బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం సాయంత్రం బేతుపల్లి చెరువులో మత్స్యకారులు చిక్కుకున్నట్లు సమాచారం అందడంతో వారిని రక్షించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సహాయక బృందాల పడవ ప్రమాదానికి గురికావడంతో పలువురు సిబ్బంది కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపు, సహాయక చర్యలు చేపట్టి ఐదుగురు మత్స్యకారులు, ఆరుగురు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, ఐదుగురు అగ్నిమాపక శాఖ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.

 *రాత్రంతా సహాయక చర్యల పర్యవేక్షణ* 

బుధవారం సాయంత్రం ఘటన జరిగినప్పటి నుంచి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ బేతుపల్లి చెరువు వద్దే ఉండి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. రాత్రంతా అక్కడే ఉండి సహాయక చర్యల పురోగతిని పర్యవేక్షించిన ఎమ్మెల్యే చొరవ, అంకితభావంపై మత్స్యకారుల కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రభుత్వానికి సమాచారం అందించారు. సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని, వనరులను సమకూర్చారు.

 *సహాయక బృందాలకు మంత్రి అభినందనలు* 

గురువారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బేతుపల్లి చెరువును సందర్శించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బందిని కలిసి అభినందించారు. చిమ్మచీకటిలోనూ ప్రాణాలను పణంగా పెట్టి 16 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయక బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బుధవారం సాయంత్రం నుంచి ఘటనను నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను సమన్వయం చేసిన జిల్లా ఉన్నతాధికారులను, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. తాను కూడా బుధవారం సాయంత్రం నుంచి అధికారులతో, ఎమ్మెల్యేతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో ప్రత్యేక చొరవ చూపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, సంబంధిత మంత్రులకు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. ఆపత్కాలంలో సమన్వయంతో పనిచేసి 16 మందిని సురక్షితంగా కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలను ప్రజలు అభినందించారు. రాత్రంతా ఉత్కంఠకు గురిచేసిన బేతుపల్లి చెరువు ఘటనలో చివరకు అందరూ సురక్షితంగా బయటపడటంతో బాధితుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం. భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం.
భీమదేవరపల్లి, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించేందుకు చేపట్టిన పథకాన్ని భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్...
ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.