ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఫారం-18 పంపిణీ.
వనపర్తి,నవంబర్03( తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో పట్టభద్రులకు ఓటు హక్కు కల్పించేందుకు ఫారం-18 పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐపీసీ వనపర్తి జిల్లా అధ్యక్షులు జి. నాగార్జున, ఎన్ఎస్యూఐ జిల్లా నాయకులు ఎత్తం చరణ్ రాజ్ ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ కార్యాలయాన్ని సందర్శించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరిమళతో పాటు కార్యాలయ సిబ్బందికి ఫారం-18 అందజేశారు. పట్టభద్రులందరూ ఫారం-18 ద్వారా తమ ఓటు హక్కును నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, పుట్ట బాలరాజ్, కుమార్, రాజు, రవి తదితర నాయకులు పాల్గొన్నారు.


Comments